Wednesday, 29 May 2019

ప్రపంచపు పనితీరు

ప్రపంచం  పరుగెడుతుంది బద్దకస్తుని పరుగుకు ముందుగా
ప్రపంచం  వెనుకోస్తుంది నడవలేని కుంటి యోదుని చేయూతగా
ప్రపంచం  భయపెడుతుంది తలదించుకు పోయే పిరికితనాన్ని చూసి
ప్రపంచం  భయపడుతుంది తలెత్తి ఎదురించే సమరాన్ని  మోసి
ప్రపంచం  గర్విస్తుంది నీ విజయబావుటా రెపరెపలు తాకి
ప్రపంచం  నవ్వేస్తుంది నీ ఓటముల గుసగుసలు పాకి 

Monday, 26 January 2015

బ్రతకాలనే కోరిక


ఏ కష్టంలో రమ్మంటామో
ఏ బాధల్లో రమ్మంటామో
ఏ అపజయం లో రమ్మంటామో
ఏ అవమానంతో రమ్మంటామో
పిరికివాళ్ళం కదా మరి మేము
పిలిచినా రావద్దు నువ్వు
నా జాగ్రత్త లో నే ఉన్నా ఎదుట వాడి
తొందరపాటుకు నా దగ్గరకు వచ్చేస్తావ్
ఏ నిర్లక్ష్యం లో వస్తావో తెలీదు
ఏ ప్రమాదమై వస్తావో తెలీదు
ఇవన్నీ చావుకి ఆహ్వన లేఖలే
అవి నీకు అందకూడదని ఆశిస్తూ....
                        ----బ్రతకాలనే కోరిక 

Wednesday, 21 January 2015

దొంగ కో లేఖ

ఒరేయ్ దొంగా
కాదులే
ఒరే మనిషీ
నా కష్టాలు తెలియవు నీకు
నా రెక్కల కష్టం గుర్తెరగువు నీవు
నా వాళ్ళనీ ఎరగవు నీవు
ఎక్కడో నిల్చున్న నన్ను
            కూర్చున్న నన్ను
            ప్రయాణిస్తున్న నన్ను
ఎలా ఎంచుకున్నావొ మరి నన్ను
అడిగితే ఇచ్చేవాడ్నెమో కదా కొంచెం
దొచేసావ్ పిల్లల చదువుల్ని
               ఒక కూతురి పెళ్లిని
               తాతయ్య ఆపరేషన్ని
               ఇంటి కనీస అవసరాల్ని
ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదు
ఏదో ఒకటి చేస్తాలే
ఎందుకంటే కష్టానికి కష్టాలకి అలవాటు పడిపోయాను మరి
తీసుకేళ్తే తీసుకెళ్ళావ్
నా చెమట వాసనతో సారాయో బ్రాందీ యో విస్కీ యో తాగొద్దు మరి
నా రెక్కల కష్టం తో పేకాట గట్రా అడోద్దు మరి
ఒళ్ళు హూనం చేసి సంపాదించిన పైసలతొ ఏ సాని కొంపలోకో వెళ్ళొద్దు మరి
ఈ పాటికే అవి నీ మంచి అవసరానికి చేరాయని ఆశిస్తున్నాను
ఒ నలుగురు ఆకలి తీర్చిందని సంబరపడుతున్నాను
నీకు కడుపు నిండిందని ఆనందంతో
ఈ రోజు సంతోషంగా పడుకుంటున్నా పస్తుతో

Tuesday, 16 December 2014

చెదరని నీ సంతకం

మరణం  Dec 14 2013

ఆశ్రు నివాళి 

ఇంకు పెన్ను కళ్ళజోడు ఈనాడు పేపరు 
కాదేది నీ ఆనవాలుకి అనర్హం 
అని విడిచి వెళ్ళావ్ 
స్వలాభాపు దీగ్రీల్లేవ్ డిగ్నిటీ పెంచే "ఉన్నత"పాటశాల చదువు తప్ప 
ఏ అభ్యర్ధన పత్రమో ప్రాంశరీ నోటొ ,ధరఖాస్తో,
జాబో,జవాబో అన్ని నీ దస్తూరి లో 
నిత్యావసర సరుకుల పంపిణి అధికారిగా ఉంటూ 
సర్కారు ఇవ్వని ప్రేమా సాయాన్ని ఇచ్చావ్ 
ఎన్ని టంకు పెట్టెల్లో వారి వారి ఆస్తులు నిర్భయంగా ఉన్నాయో 
నిర్మలమైన నీ చెదరని సంతకంతో 
కొన్నేళ్ళు రాజ్యాధికారం 
పిమ్మట ఆనారోగ్యంతో అరణ్యవాసం 
ఇప్పుడేమో అమరుడవై అజ్ఞాతవాసం 
ఎన్ని తగవులు తీర్చిందో ఎందరి భవిష్యత్ మార్చిందో 
శివరాం ప్రజల గుండెల్లో ఎప్పుడూ చెదరని నీ సంతకం 


Saturday, 22 November 2014

గ్రంథాలయం కోసం పుస్తక సేకరణ మరియు అన్వేషణ

 గౌరవనీయులైన తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం 

                              మా ఊర్లో కుర్రవాళ్ళందరూ కలసి చిన్న గ్రంధాలయం పెడదాం అని అనుకున్నాం.  అన్ని కుదిరినా సరే పుస్తకాలు మాత్రం అందుబాటులో లేవు.  పాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో  చెబితె  అక్కడకు వెళ్లి మేం కొనుక్కుంటాం. ఎవరైనా బుక్స్ డొనేట్ చేసినా మాకు తెలియజేయగలరు.  ఎవరి దగ్గరైనా ఎక్కువ పుస్తకాలు ఉన్నా మాకోసం ఒక పుస్తకాన్ని పంప గలరు. చందమామ చతుర లాంటి మాగ్జిన్స్ దొరకడం కష్టమౌతుంది ఉంటె పంపించగలరు చిన్న పిల్లలకు ఉపయోగపడతాయ్.  ఇ మెసేజ్ మీ బ్లాగ్ మిత్రుల కు పంపిస్తారని ఆశిస్తూ.... 

                                                                                                    మీ 
                                                                                         ఓ బ్లాగ్ మిత్రుడు. 

నా  ఫోన్ నెంబర్  8309146769,(g.pydinaidu)

ముఖ్యంగా  తెలుగు పుస్తకాలు ఏవైనా సరే ఉంటె చెప్పగలరు 

అడ్రస్ :

G.Ramakrishna (FP shop dealer)..
s/o sureedu..sivaram village & post
cheepurupalli (so).
garividi (md)
vzm (dt)
pin code:-535128
e-mail id:-rkgavidi@gmail.com
cell no:-9030169829

Tuesday, 11 November 2014

బరితెగిస్తున్నబూతు

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు
చిన్నపిల్లల్నుంచి పెద్దలవరకు
కంప్యూటర్ చదివేవాడ్నించి కూలీ వరకు
అష్టాచెమ్మా ఆటనుంచి క్రికెట్‌ వరకు
ఎవరైనా సరే ఎక్కడైనా సరే
నోరు తెరిస్తే బూతులు

ఎదుటవారు చదివిన చదువును గుర్తించరు
అతని స్థాయిని పట్టించుకోరు
కనీసం వయస్సునూ గౌరవించరు
వారిముందే బూతులు
అమ్మాయిలు కనిపిస్తే చాలు కామపు కామెంట్సు

భార్యను నిర్బంధం చేసి ఒకరు
భర్త కళ్ళను కప్పి ఒకరు
సెల్లు ఫోనుల్లొ e మానసిక వ్యభిచారం
వాట్స్‌ అప్ లొ ఇంకా చెప్పక్కర్లేదు
ఫేస్ బుక్కుల్లొ ఇంకెన్నో

వయసు రాకముందే స్త్రీ శరీరసాంగత్యము
తెలుసుకొవాలనే ఆరాటం తో ఒకరు
వయసు మళ్ళినా స్త్రీ తనువును మరువలేని
తెలుసుకోలేని మరోకరు
ఈ సమాజమే మార్చిందని ఒకరు
ఈ సమాజమే మారిపోయిందని ఒకరు
కళ్ళు తెరిచే లోపే కళ్ళు మూసుకునే చర్యలు

మీడియా కూడా అంతే
హట్ హట్ సినిమా న్యూస్‌ లేని న్యూస్‌ చానల్  లేదు
ఐటం సాంగ్ లేని సినిమా కూడా లేదు
చివరకు మగాడు గెడ్డం గీసుకునే అడ్వటైజ్ మెంట్ లొ
కూడా చిత్రంగా ఇ అమ్మాయే
అమ్మాయిలు లేని ప్రయాణం బోర్
అమ్మాయిలు రాని కాలేజీలు దండగా
అమ్మాయిల కోసమే పండగలకు
అమ్మాయిల కోసమే జాతర్లకు
అమ్మాయిల కోసమే పెళ్ళిళ్ళకు
అమ్మాయిల కోసమే షికార్లకు

అవకాశం వస్తుందేమోనని ప్రేమ
అవసరం కోసమే అనుకోని పెళ్ళి
మనుషుల్లో తిరిగే ప్రేమల కంటే
 పార్కులో తిరిగే ప్రేమలే ఎక్కువ

స్త్రీ పై జరిగే అఘాయిత్యానికి కారణం
చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఆడిన
కామెంట్లు బూతులు ముదిరి
వాళ్ళ కోసమే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న
జాతర ఫేయిలై
సినిమా ఫేయిలై
షికారు ఫేయిలై
అవకాశం కోసం చూసిన ప్రేమా ఫేయిలైతే
అది క్రమేణా ముదిరి మగాడ్ని  మృగం లా మార్చి
ఎ ఆడపిల్ల ఒంటరిగా దొరికిన
ఎలాంటి అఘాయిత్యానికైనా తెగిస్తాడు

అదేంటో
సాటి మగాడు సాదించిన విజయం
సరి పొల్చుకొ అంటే
వాడు మనకంటే పెద్దవాడని
డబ్బున్న వాడని
చదువు కున్నవాడని
సాకులు వెతికే మనకి
అమ్మాయి ని చూసినప్పుడు మాత్రమే
మన మగతనం గుర్తొస్తుంది.
వయసూ చదువులను మరచి

చినుకు రాలడానికి ఒక సమయముంది
ఆకు కూడా కొన్ని సమయాలలోనే చిగురిస్తుంది
పూలు కూడా వాటి సమయంలొ మాత్రమే పూస్తాయి
వాటి సమయం వచ్చినప్పుడే పండ్లు పండుతాయ్
చివరకు కుక్క కూడా వేరొక కుక్కతో
సంభోగించడానికి ఒక కార్తి ఉంది
మనిషే ఎందుకో ఇలా
నాలుగోడల మధ్య జరిగేదాన్ని
నడిరోడ్డి పై మృగంలా.....