Sunday 28 August 2011

వాన పై ఇప్పుడూ కోపమొచ్చింది

                                                                  నేను ఇంటి దగ్గర ఉన్నాను మద్యాహ్నం 2:00 గంటల సమయం కావచ్చింది. అంతవరకు భానుడు తన ప్రతాపాన్ని చూపి అతను ఇంటికి వెళ్లి పోయాడు తను ఎప్పుడైతే ఇంటికి వెల్లిపోయాడో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు తమ ఇళ్ళకు వచ్చేస్తున్నారు.చల్లని గాలులు వీస్తున్నాయి.చెట్లు పరశించి ఊగుతున్నయ్ పక్రుతినై పుడితే బాగున్నేమోనని అనిపించింది. ఎందుకంటే వాటితో పాటు నేను తడిసి నేను వాటిలా ఆనందంగా గెంతులసేవాడిని వాటికి అమ్మానాన్న బందువులు చుట్టాలు ఎవరూ లేరు అడిగే వాళ్ళే లేరు కాని నాకు ఇంటి దగ్గర తడిస్తే అమ్మ తిడితుంది పొలంలో తడిస్తే నాన్న కొడతాడు  ఊర్లో తడిస్తే బందువులు అడ్డుతగిలి అడుగుతారు కానీ ప్రోత్సహించేవారు ఎవరూ లేరు.అందుకే  ప్రకృతితో కలిసి అడుకుందామని నెనూ బయటకు వెళ్ళిపోయాను.
                ప్రకృతి నన్నుమేళతాళాలతో (ఉరుములు మెరుపులు) ఆహ్వానించింది.చినుకు నా చెంపను ముద్దాడింది. నా ఒళ్ళు పులకరించింది.పుడమి పరవసించిపోయింది.అంతవరకు నాలో ఉన్న భయాల్నివాన కడిగేస్తుంది.మెరిసే మెరుపు మా ఊరుకు ముత్యాల హరంలా కనబడుతుంది ఉరిమేఉరుము మాఊరి బలాన్ని కలసి కట్టు తనాన్ని మరిపిస్తుంది.కురిసే ఆ చల్లనిజల్లు పల్లె ప్రేమానురాగాల్నికురిపిస్తుంది.పంట పొలాలు నాతో పాటుగా ఊగుతున్నాయి.నాకు తెలియకుండానే పొలంలోకి వచ్చేసాను.నాన్న గుర్తొచ్చాడు భయంతో ఇంటికి దారితిసాను.
               ఊర్లోకి వచ్చేసాను.మా వీధిలో ఒక అపురూపమైన సన్నివేశం అదే మా కిట్టు గాడి ఇంట్లో వాన.నాకు వానపై కోపం వచ్చింది మా ఇంట్లోకి రాకుండా వాడి ఇంట్లోకి వెళ్లిందని.ఎవరో అన్నట్టు వాళ్ళింటి అడ్రస్ వానకు బాగా తెలుసేమో సరాసరి వాళ్ళ ఇంటిలోకే వెళ్ళిపోయింది.కిట్టు గాడు హాయ్ గా ఇంట్లోనే ఆడుకుంటున్నాడు.వాళ్ళమ్మ చాలా మంచిది ఆడుకోడానికి స్థలం సరిపోవడం లేదని ఇంట్లో ఉన్న వస్తువులు మా డాబా ఇంటిలో పెడుతుంది .వాడుమాత్రం చక్కగా గిన్నెలతోపాత్రలతో ఆడుకుంటున్నాడు.నేను కిట్టు దగ్గరకువెళ్లి కిట్టుతో ఆడుకుందామనుకున్నాను  వాడు  నావైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. వాడు నన్ను వెక్కిరింత చేసినట్టు అనిపించింది.అందుకే ఇంటికి వెళ్ళిపోయా ఇంటిదగ్గర అమ్మ నాకోసం ఎదురుచూస్తుంది.
             ఇంటికి వెళ్ళగానే అమ్మ నన్ను కొట్టింది.మన ఇంట్లోకి రాని వాన లోనికి నువ్వెందుకు వెళ్ళావని కొట్టి ఉంటుందిలే అనుకున్నాను.అందుకే వాన తగ్గిపోయి ఏకంగా నా కంట్లోకే వచ్చేసింది.నా చెంపను ముద్దాడి నన్ను ఓదార్చింది.అందుకే నేను ఇంకా ఏడవకుండా ఇంట్లోకుర్చోని చదువుకున్నాను. రాత్రి భోజనం చేసి పడుకోబోయే సరికి మళ్ళి వాన మొదలైంది.మా అమ్మ నన్నుఅడ్డుకుంది కాని కిట్టు గాడు ఆడుకుంటున్నాడు.చేసేదేమీ లేక నేను పడుకుండిపోయాను.ఉదయం లేచేసరికి కిట్టు గాడు మా వాకిట్లో పడుకొని ఉన్నాడు వాడికి వాళ్ళమ్మ బుజ్జగిస్తూ ఉంది.అమ్మ వాళ్లకు ఏవో ఇచ్చింది కిట్టు వాళ్ళ అమ్మ అవి తీసుకోని కిట్టు గాడిని తీసుకోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
             నేను స్నానం చేసి స్కూల్ కి బయలుదేరి వెళ్లి పోయాను.స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరం అడుకుంటున్నాం కిట్టు గుర్తొచ్చాడు వాడు వచ్చి నిన్నటి వాన విషయం అందరితో చెప్పి నన్ను ఎగతాళి చేస్తాడనుకున్న కానీ కిట్టు ఇంకా బడికి రాలేదు.స్కూల్ విడిచి పెట్టేసారు ఆ రోజు కిట్టు స్కూల్ కి రాలేదు. అమ్మయ్య అనుకోని ఇంటికి వచ్చి కిట్టు స్కూల్ కి రాలేదని అమ్మకు చెప్పను. అప్పుడు అమ్మ అవునురా కిట్టు స్కూల్ కి రాలేదు.వాడికి జ్వరం వచ్చింది నిన్నంతా పాపం వానలో తడిసాడుగా అందుకే అని అంది (అమాయకంగా).నేను కోపంగా పాపం అంటా వేమిటి వాడు అడుకుంటేను అన్నాను నేను .దానికి అమ్మ కాదురా వాడు ఆడుకోలేదురా ఇంట్లో ఉన్న కొద్ది సామాన్లు తడవకుండా చూసుకొన్నాడు.కొన్ని మన ఇంట్లో పెట్టారు వాళ్ళది పూరిల్లు వానొస్తే పైకప్పు ఎగిరి పై నుండి లోపలికి నీరు వస్తుంది.వాళ్ళు నిన్నటు నుండి వంట చేసు కోలేదు ఇప్పుడు కొంచెం అన్నం ఇచ్చి వచ్చాను కిట్టు రాత్రంతా తడవడం వలన జలుబు చేసి జ్వరం వచ్చింది అని చెప్పింది. 
           అమ్మ ఇంట్లోకి వెళ్లి తన పనులు తను చూసుకొంటుంది.నేను పుస్తకాలు ఇంట్లో పెట్టి కిట్టును కలుసుకోడానికని బయటకు వచ్చాను ఇంతలో ఒక పెద్ద మెరుపు హూ ....వానపై ఇప్పుడూ కోపమొచ్చింది అందుకే త్వరగా వెళ్లి కిట్టును మా ఇంటికి తీసుకొచ్చేసాను.కొన్నాళ్ళ తరువాత కిట్టు వాళ్ళ ఇంటి అడ్రెస్స్ (పైకప్పు)మారిపోయింది.ఇప్పుడు వానకు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదు అందుకే అప్పుడప్పుడు మేమే బయటకు వచ్చి వానను కలుసుకుంటున్నాం.
         

Sunday 21 August 2011

Sunday 14 August 2011

ప్లీజ్.........అలా చెయ్యొద్దు

నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.
(21-07-2011)సాక్షి పేపర్ (16 వ పేజిలో)
   
                                                        మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళ పాలన నుండి విడిపించుకోవడానికి మన వారు ఒక నినాదం (సూత్రం) పాటించారు అదే చెయ్యు లేదా చావు (డూ ఆర్ డై ). అంటే నువ్వు పోరాడు అ సాధనలో (పోరాటంలో) చనిపో అంతే కానీ వెనకడుగు వేయకు అని. మరి ఇతను ఏం చేసి చనిపోయాడు. ఏమి లేదు కొంత మాత్రమే చూసి చనిపోయాడు. కొంత మాత్రమే చూసి అని ఎందుకు అన్నానంటే ఆ కొంత అనేది ఈ పోరాటాలు,ఉద్యమాలు,రాష్ట్రాలు,దేశాలు కావు. తన జీవితం,వ్యక్తిగతం,కుటుంబం.  అతను రాసారు అమ్మను చూడాలని అమ్మచేతి వంటతో కడుపు నిండా తినాలి అని. ఎంత చిన్న మనసు,ఎంత చిన్న వయసు నిజమే ఎందుకంటే ఇంకా అతను అమ్మ పెంపకంలోనే ఉన్నాడు.అంటే జీవితంలో కొంతే చూసాడుగా.
                                                
                                                           మరి తనను అంత ప్రేమగా చూసుకున్న అమ్మకు,చెల్లికు అతను ఏం చేసాడు.మిగిలిన తన కొంత జీవితాన్ని అమ్మకోసం చెల్లి కోసం సాయపడుతూ బ్రతకాలిగా.అమ్మ చేతి ముద్దతో కడుపారా తిన్న ఆ కొడుకు అమ్మ ప్రేమను చూసాడు. మరి ఆ అమ్మకు కొడుకు చేతి ముద్దతో కడుపారా తినిపించి కన్నప్రేమను చూపించ లేక పోయాడు. తను అన్నాడు తెలంగాణా కోసం ఉద్యమంలో ఓ బిందువునైతానని.కానీ ఆ తల్లి చేల్లిలను మాత్రం శోక సంద్రంలో ముంచి పోయాడు. తనను తాను చంపుకున్నవాడు పోరాటంలో  బిందువు కాదు కదా ఒక పరమాణువు కూడా కాలేడు అని నా ఉద్దేశ్యం.
  
                                                            మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతోమంది  "నాయకులు" తమ ప్రాణాలను అర్పించారు.గమనించాలి అప్పుడు ప్రాణాలు అర్పించింది సామాన్యప్రజలు కాదు నాయకులు.వాళ్ళు కూడా ఎవరూ అత్మహత్యకు పాల్పడలేదు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారే అందుకే వారు వీరులు,చరిత్రకారులు అయ్యారు.అదే వారు ఆ రోజు మనలాగే ఏ అగాయిత్యానికో పాల్పడితే  వారు (ఆంగ్లేయులు) మనల్ని హీనులుగా, పిరికివాళ్ళగా చూసేవారు.మనము ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు.వారికీ భానిసలుగా బ్రతుకులు ఈడ్చే వాళ్ళం.మనం నిర్మించిన సర్కారుకు భయపడి మనం తనువు చాలించి సాధించింది ఏం లేదు కాబట్టి ముందుగా మనల్ని నమ్ముకున్న వారిని,నమ్మివచ్చినవారిని సంతోషంగా ఉంచుదాం.తరువాత సమాజంలో మన వంతు పాత్ర పోషిద్దాం.అంతేకాని క్షణికావేశాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

                                                             ఒక చావుతో ప్రభుత్వం తన  మనసు మార్చుకుంటుంది అనుకుంటే దానికి ముందుగా మనం నిలబెట్టిన క్షమించాలి మన కోసం నిలబడిన ప్రజా నాయకులు ఉన్నారు.అంతేకాని మనం తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయాలు ఈ ప్రభుత్వం దగ్గర ఎందుకు పనికిరావు.ఆ రోజు దీనపత్రికలో చిన్న శిర్షీకలా మిగిలిపోతాం.ఎక్కడో నలిగిపోతాం లేకపోతే చిరిగిపోతాం అంతే.పోరాడు పోరాటంలోనే అవసరమైతే ప్రాణాలను అర్పించి చరిత్రకారుడుగా మిగిలిపో అంతేకానీ తొందరపాటు నిర్ణయాలతో పిరికివాడిగా మిగిలిపోకు.చివరిగా అతని ఆత్మకు శాంతి చేకూరాలని,అమ్మకు,చెల్లికు అతని లోటు తప్పా అన్ని చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తూ ...........................   
                                                          
                                                                                                                                     మీ
                                                                                                                             చిలిపి చిన్నోడు