Sunday 14 August 2011

ప్లీజ్.........అలా చెయ్యొద్దు

నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.
(21-07-2011)సాక్షి పేపర్ (16 వ పేజిలో)
   
                                                        మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళ పాలన నుండి విడిపించుకోవడానికి మన వారు ఒక నినాదం (సూత్రం) పాటించారు అదే చెయ్యు లేదా చావు (డూ ఆర్ డై ). అంటే నువ్వు పోరాడు అ సాధనలో (పోరాటంలో) చనిపో అంతే కానీ వెనకడుగు వేయకు అని. మరి ఇతను ఏం చేసి చనిపోయాడు. ఏమి లేదు కొంత మాత్రమే చూసి చనిపోయాడు. కొంత మాత్రమే చూసి అని ఎందుకు అన్నానంటే ఆ కొంత అనేది ఈ పోరాటాలు,ఉద్యమాలు,రాష్ట్రాలు,దేశాలు కావు. తన జీవితం,వ్యక్తిగతం,కుటుంబం.  అతను రాసారు అమ్మను చూడాలని అమ్మచేతి వంటతో కడుపు నిండా తినాలి అని. ఎంత చిన్న మనసు,ఎంత చిన్న వయసు నిజమే ఎందుకంటే ఇంకా అతను అమ్మ పెంపకంలోనే ఉన్నాడు.అంటే జీవితంలో కొంతే చూసాడుగా.
                                                
                                                           మరి తనను అంత ప్రేమగా చూసుకున్న అమ్మకు,చెల్లికు అతను ఏం చేసాడు.మిగిలిన తన కొంత జీవితాన్ని అమ్మకోసం చెల్లి కోసం సాయపడుతూ బ్రతకాలిగా.అమ్మ చేతి ముద్దతో కడుపారా తిన్న ఆ కొడుకు అమ్మ ప్రేమను చూసాడు. మరి ఆ అమ్మకు కొడుకు చేతి ముద్దతో కడుపారా తినిపించి కన్నప్రేమను చూపించ లేక పోయాడు. తను అన్నాడు తెలంగాణా కోసం ఉద్యమంలో ఓ బిందువునైతానని.కానీ ఆ తల్లి చేల్లిలను మాత్రం శోక సంద్రంలో ముంచి పోయాడు. తనను తాను చంపుకున్నవాడు పోరాటంలో  బిందువు కాదు కదా ఒక పరమాణువు కూడా కాలేడు అని నా ఉద్దేశ్యం.
  
                                                            మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతోమంది  "నాయకులు" తమ ప్రాణాలను అర్పించారు.గమనించాలి అప్పుడు ప్రాణాలు అర్పించింది సామాన్యప్రజలు కాదు నాయకులు.వాళ్ళు కూడా ఎవరూ అత్మహత్యకు పాల్పడలేదు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారే అందుకే వారు వీరులు,చరిత్రకారులు అయ్యారు.అదే వారు ఆ రోజు మనలాగే ఏ అగాయిత్యానికో పాల్పడితే  వారు (ఆంగ్లేయులు) మనల్ని హీనులుగా, పిరికివాళ్ళగా చూసేవారు.మనము ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు.వారికీ భానిసలుగా బ్రతుకులు ఈడ్చే వాళ్ళం.మనం నిర్మించిన సర్కారుకు భయపడి మనం తనువు చాలించి సాధించింది ఏం లేదు కాబట్టి ముందుగా మనల్ని నమ్ముకున్న వారిని,నమ్మివచ్చినవారిని సంతోషంగా ఉంచుదాం.తరువాత సమాజంలో మన వంతు పాత్ర పోషిద్దాం.అంతేకాని క్షణికావేశాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

                                                             ఒక చావుతో ప్రభుత్వం తన  మనసు మార్చుకుంటుంది అనుకుంటే దానికి ముందుగా మనం నిలబెట్టిన క్షమించాలి మన కోసం నిలబడిన ప్రజా నాయకులు ఉన్నారు.అంతేకాని మనం తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయాలు ఈ ప్రభుత్వం దగ్గర ఎందుకు పనికిరావు.ఆ రోజు దీనపత్రికలో చిన్న శిర్షీకలా మిగిలిపోతాం.ఎక్కడో నలిగిపోతాం లేకపోతే చిరిగిపోతాం అంతే.పోరాడు పోరాటంలోనే అవసరమైతే ప్రాణాలను అర్పించి చరిత్రకారుడుగా మిగిలిపో అంతేకానీ తొందరపాటు నిర్ణయాలతో పిరికివాడిగా మిగిలిపోకు.చివరిగా అతని ఆత్మకు శాంతి చేకూరాలని,అమ్మకు,చెల్లికు అతని లోటు తప్పా అన్ని చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తూ ...........................   
                                                          
                                                                                                                                     మీ
                                                                                                                             చిలిపి చిన్నోడు 

3 comments:

Srinu Web developer said...

chaala bavundi.........and atuvantivi neenu face chesa.......but okkaritho ayyepani kadu kadha......

వనజ తాతినేని/VanajaTatineni said...

well said.. plz.. pass on any media

pydinaidu said...

thanks for suggestion vanajagaaru