Tuesday 8 November 2011

కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో

నెట్లో ఈ పాటను స్వామి సరస్వతి గారు అప్ లోడ్ చేసారు  
 ఈ పాట ఎవరు రాసారో ?
 ఎవరు పాడారో తెలిస్తే తెలుపగలరు?
అలాగే క్రింది కవిత ఎవరు రాసారో తెలుపగలరు 




అమ్మ మనసు

నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!


నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!


నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!


నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!


తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!


ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!


జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!


ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!


ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది. 
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!


3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa baagundhi.. Thanks for sharing

Srinu Web developer said...

ade ammante........

pydinaidu said...

వెంకీ చెప్పారు :- సూపర్ ...........అన్ని అనుభూతులు చెందిన ఒక ఆడది కూడా ఇంత చక్కగా అమ్మ మనసును వర్ణించలేదు అనుకుంటా?
{వెంకీ(పండు) నీ పూర్తి కామెంట్ పబ్లిష్ చేయలేదు ఎందుకంటే నువ్వు నన్ను పొగుడుతూ రాశావ్....అది నేను రాయలేదు. }