Wednesday 20 July 2011

ఆ రోజు నాకు ఆనందమే

నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.

                                        ఆ రోజు నేను ఇంకా పడుకోనే ఉన్నాను. మెలుకువ రాలేదు  ఏదో  చప్పుడు  అనిపించింది  ఎవరో  మాట్లాడుకుంటున్నారు. లేచి  చూసాను.ఎక్కడ ఉన్నానో అర్ధం కాలేదు. వాళ్ళు నా  దగ్గరకు వచ్చారు  వాళ్ళను నేను ఎప్పుడో చూసాను.అరే వాళ్ళు మావాళ్ళే .వాళ్ళు నన్ను గట్టిగా  హత్తుకొని  ఏడుస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది.వాళ్ళను నేను కలుసుకున్నందుకు.అదే విషయం  అమ్మానాన్నలకు  స్నేహితులకు వీళ్ళ బందువలకు చెబుదామని వాళ్ళను విడిపించుకొని  వచ్చేసాను.

                                        ఊర్లో ఎవరి పనుల్లో వారు ఉన్నారు.ఇంకా మా ఇల్లు రావడానికి చాలా దూరం ఉంది. నేను ఎవరిని పలకరించినా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు వాళ్లకు ఈరోజు చాలా తీరిక లేని  పనులున్నాయని అనుకున్నాను.పిల్లలు బడికి వెళ్ళడానికి మారం చేస్తున్నారు. నేను వాళ్ళను బుజ్జగించి పంపిద్దమనుకున్నాను.కానీ ముందు నా ఆనందాన్ని అమ్మానాన్నలతో చెప్పాలి స్నేహితులతో  పంచుకోవాలి. వారి వారి బందువులకు తెలియజేయాలి. అందుకే తొందరగా నడవ సాగాను.

                                మా ఇల్లు దగ్గర పడింది.కానీ ఇంటి దగ్గర ఎక్కువగా మనుషులు ఉన్నారు.నేను  అనుకున్నాను వాళ్ళు నాకంటే ముందే ఇంటికి వచ్చేసరేమోనని లేదంటే నా కంటే ముందే ఈ విషయం  మా  వాళ్లకి తెలిసి పోయిందని.ఛ ఇంకా వేగంగా నడవ వలసింది.నా స్నేహితులంతా ఒక దగ్గరకు చేరి ఉన్నారు.పట్టణంలో ఉంటున్న స్నేహితుడు ఒకడు అప్పుడే వచ్చి వాళ్ళ చెవిలో ఏదో చెప్పాడు వాళ్ళు దానికి  మౌనం గానే తల ఊపారు నాకు ఆశ్చర్యమేసింది వాళ్ళు మౌనంగా ఉండడం.వీళ్ళు ఎక్కడ ఉంటె అక్కడ రచ్చరచ్చ  చేసే వీళ్ళా అలా ఉన్నారు అనుకున్నాను.వచ్చిన పెద్దవారి ముందు గౌరవమేమో అనుకున్నా.

                         వాళ్ళను పిలిచాను వారు పలకలేదు. నాకు కోపం వచ్చింది.అందుకే  అమ్మనే  కలుసుకుందామని తిన్నగా ఇంట్లోకి వెళ్లాను. అక్కడ ఇంతకుముందు నేను చూసిన పెద్దవారు ఎవరులేరు. లోపలికి వెళ్ళాను. అమ్మ ఏడుస్తోంది. అరే ఏంటి అమ్మ ఏడుస్తోంది?.ఒదార్చుదామని అమ్మను  పట్టుకున్నా అమ్మకు చలనం లేదు.ఎదురుగా చూసాను అందమైన పూల వరుసలో నా ప్రతిబింబం అప్పుడే  తెలిసింది నాకు  నేను చనిపోయానని.

                  అయ్యో ఎంత పనిచేసాను. నన్ను నేను తిట్టు కున్నాను.ఏడ్చాను. నన్నునమ్ముకున్నవారిని  నన్ను నమ్మి వచ్చిన వారిని  విడిచిపెట్టిపోయినందుకు చాలా బాధ పడ్డాను.వారి కంటే ఎక్కువగానే ఏడ్చాను.కానీ నాకు  చాలా ఆనందమేసింది.వారి కంటే ముందు వెళ్లిపోయినందుకు.ఎందుకంటే వారి చావును నేను సహించలేను చూడలేను.

తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు

నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.

                                 తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు  అయితే మరి మన పెద్దలు ఏం చేసారు. మనకు ఏం చెప్పారు. అసలు పెద్ద వారు అంటే ఏవరు?
                .నేను ఇంకా చిన్న పిల్లవాడినే. ఎందుకంటారా నేను ఇంకా నేర్చుకునే ఉంటున్నాను. మరి నేర్చుకున్న ప్రతి వాడు చిన్న వాడు ఐతే ప్రతి మనిషి చిన్న వాడే ఎందుకంటే ఎవ్వరికి అన్ని విషయాలు తెలియవు. మరి పెద్ద వాళ్ళు ఏవరు?[వయస్సు కాదు ఇక్కడ ముఖ్యం ].  మరి అన్ని తెలుసు అనుకున్నవారా?      కాదు ఎందుకంటే తనకు ఏమి తెలియదన్న విషయం తనకు తెలుసు. మరి ఏవరు పెద్ద ?మనకంటే ఎక్కువ తెలిసిన వాడు మనకంటే పెద్ద.  
                          అయితే గాంధీ,నెహ్రు,వివేకానందుడు మొదలగు వారు మన కంటే క్షమించాలి నా కంటే పెద్దవారు. ఎందుకంటే నాకంటే వాళ్ళకు ఎక్కువగా తెలుసు. ఐతే వాళ్ళు ఏం చెప్పారు ఉన్న దానితో తృప్తి పదండి. అన్నారు తృప్తి చెందిన వారు ఐతే ఇ ఉద్యోగాలు, పోరాటాలు ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చుగా  దొరికితే తింటూ లేక పొతే దొరకలేదని తృప్తి పడుతూ మరి ఎందుకు ఇ చదువులు ప్రయాణాలు ఆపేద్దాం ఏమంటారు.

[ఇదంతా ఎందుకు రాసానంటే నేను బస్సులో వెళ్తూ ఉంటె వేరే సీట్లో కూర్చున్న నేను ఏదో కక్కుర్తితో లేచి వెళ్లి  విండో సీట్లో కూర్చున్న అందుకు ప్రక్కనున్న ఆయనా నన్ను ఎరా బాబు ఎందుకు అలా సీట్లు మారుతావు ఉన్న దానితో తృప్తి పడకుండా అని అన్నాడు. అందుకు నేను బదులుగా పై మాటలు అన్నాను. తప్పుగా అంటే మీరేక్షమించండి. ఎందుకంటే ఇంకా నేను మీ చిలిపి చిన్నోడినే కదా]

 "తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు" నిజమే మరి తృప్తి అంటే ఏమిటి?నాకు తెలిసినంత వరకు ఇది మనకు రాదు ఇంకా జరగదు అని అనిపిస్తేనే రాజీ పడతాం అదే  తృప్తి. అలాంటప్పుడే తృప్తి పడాలి.అప్పుడే మన మనసుకి ఆనందం ఆరోగ్యం , అవకాసం ఉంటె సాదించాలి.

                    "  శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది."

Tuesday 19 July 2011

అచ్చం మా పాపలాగే


                                                    కోడి కూసింది పల్లెమేల్కొంది. నేను ఇంకా పడుకోనే ఉన్నాను  ఎందుకంటే  లేవగానే మా పాప ముఖం చూడాలని తన పాలబుగ్గలను నిమరాలని. ఎక్కడో చిన్న నవ్వు  వినబడింది అవును అది నా పాపే. నాన్నా అంటూ నా దగ్గరకు వచ్చింది నేను లేచాను నా కాళ్ళను బంధించింది.ఎత్తుకున్నాను తన నుదిటిపై  అప్పుడే రవి ఉదయించినట్టు బొట్టుపెట్టింది వాళ్ళమ్మ. తన  నుదిటిపై ముద్దు పెట్టుకున్నాను.నాకు బుగ్గపై ముద్దు పెట్టింది.అలా బయటకు వచ్చాను అప్పుడే రవి ఉదయిస్తున్నాడు చాలా అందంగా కనిపిస్తున్నాడు మా పాప నవ్వులా.వాళ్ళమ్మ అందంలా.

                                  ఉదయం బోజనం  చేసి నేను బయటకు వెళ్తున్నాను పాప ఆడుకుంటుంది . రైతులు వారి వారి పనులుకు వెళ్తున్నారు సంక్రాంతి సమయం కావడంతో వీధి రోడ్లు రంగులతో ముస్తాబు గా  ఉన్నాయి.వాటిపై నడిస్తే కొడతారేమో అన్నంత అందంగా ఉన్నాయి ఆ ముగ్గులు.అందుకే అక్కడే నిలబడిపోయాను. నాన్న తన పనులు తను చూసుకుంటున్నాడు.నన్ను పట్నం వెళ్లి పంటకు కావలసిన  ఎరువులు, సామాన్లు తెమ్మన్నాడు.వెళ్ళాను అక్కడ పనులు ముగించుకొని వస్తున్నాను.సూర్యుడు  మండుతున్నాడు ఎండ తీవ్రత బాగా పెరిగింది సూర్యుడ్ని చూడలేకపోతున్నాం  ఏడుపులో మా పాపలా  కోపంలో వాళ్ళ అమ్మలా .

                             ఇంటికి చేరుకున్నాను నా బంగారు కొండలు నా గురించి ఎదురు  చూస్తున్నారు.రాగానే పాప నన్ను అల్లుకుంది వాళ్ళమ్మ నా చేతిలో సామాన్లు తీసుకోని వాటిని  భద్రపరిచింది. కాస్త అలసట తీర్చుకొని  భోజనం కానిచ్చి పాపతో ఆడుకుంటూ అలా నిద్రలోకి జారు కున్నాను పాప నా గుండెలపై ఆడుకుంటూ తను పడుకుంది. సాయంత్రం అయింది నేను లేచేసరికి. ఎప్పుడు లేచిందో  పాప మౌనంగా ఉంది వాళ్ళమ్మ బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతుంది నాకు అర్ధమైంది పాప అలిగిందని.అలా బయటకు వచ్చాను రవి అస్తమిస్తున్నాడు.చాలా జాలిగా కనిపించాడు.  మారంలో మా పాపలా బుజ్జగింపులో వాళ్ళమ్మలా.


                                            ఉదయం వెళ్ళిన రైతులు తమ పనులు ముగించుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకు వస్తున్నారు. నాన్న ఏదో పని మీద పిలిచాడు తనతో వెళ్లాను తిరిగి రాత్రైంది వచ్చేసరికి.అంతా  ప్రసాంతంగా  ఉంది ఇంటికి చేరుకున్నాం. పాప గురుంచి వాళ్ళమ్మను అడిగాను ఇప్పుడే పడుకుంది అనిచెప్పింది.రాత్రి  భోజనం కానిచ్చి ఆరుబయట  మంచంపై ఉన్న పాప దగ్గరకు వెళ్ళాను తను నిద్రపోతుంది.నేను పక్కనే పడుకొని ఆకాశం వైపు చూసాను చందమామ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నిద్రలోని మాపాపలా ప్రేమలో వాళ్ళ అమ్మలా.

Monday 11 July 2011

రక్షా - శిక్షా

                                                   మొన్ననే  పేపర్లో చదివాను. జంతువును చంపినందుకు వ్యక్తీ కి జైలు శిక్షా అని. అప్పుడు అనుకున్నాను మన ప్రభుత్వం చాల గొప్పది ఎందుకంటే మన సమస్యలే పట్టించుకోని సరైన సమాధానాలు లేని మన ప్రభుత్వం నోరు లేని మూగజీవాల బాధలను వాటి ప్రాణ విలువలను తెలుసుకొని అలాంటి రాక్షషులను శిక్సిస్తున్నారని ఇంకా అంతరించిపోతున్న కొన్ని జంతు జాతులను కాపాడుతున్నారని తెలిసి చాలా ఆనంద  పడ్డాను. కానీ.......... చాలు మనుషులుగా ఈ పని చేసినందుకు కొంచెం సిగ్గు పడదాం.

                                               
                                                     సిగ్గు పడదాం అని ఎందుకన్నానంటే నిన్న నేను "జూ" కు వెళ్లాను. అది జూ కాదు ఒక జంతుజైలు పాపం ఎ తప్పు చేయని అమాయక నిర్దోషులు అవి. "మేము ఎ తప్పు చయలేదు మమ్మల్ని విదిచిపెట్టేయండి బాబూ" అని లోపల అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటె బయట మనం ఆనంద పడిపోతున్నాం. వాడెవడో ఒక జంతువును ఒక్క క్షణంలో ఎ హింసా పెట్టకుండా చంపేసాడు. పాపం వాడికి జైలు శిక్షా ఎందుకంటే బోనులో ఉండవలసిన దాన్ని చంపాడుగా అందుకే వాడికి జైలు శిక్స. o.k అతను తప్పు చేసాడు శిక్స వేసారు. మరి ఎ తప్పు చేయని అ అమాయక మూగజీవాలకు తమ స్వేచ్చను,ఆనందాలను,కోర్కెలను,బంధించి ఉంచేసారే మరి ఈ అధికారులకి ఏ శిక్స వేయాలి?. అసలు వాటిపై ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు?.
                                               
                                                       ఇచ్చింది ఎవరో  కాదు  మనమే.  ఐతే వాళ్ళ అధికారాన్ని మనుషులపై చూపించమనండి. వాటిని అడిగారా? అవి వాళ్ళకు పదవులునిచ్చాయా? మరి ఎందుకు వాటిపై ఈ అధికారం. ఐనా వాటిని ఎందుకు జూ లో ఉంచాలి వాటిని చూడకపోతే మనుషులు చనిపోతారా?. మన ఆనందాల కోసం వాటిని బందిచాలా?   అలా కాదు గాని మనుషులు కొందరిని అడవికి తీసికెళ్ళి "మనిషి ప్రదర్సన శాల" అని పెట్టాలి. అడవి లో జంతువులు చూస్తూ ఉంటే లోపల మనిషి వదలండి అని బుర్రకోట్టుకుంటూ జుట్టు పీక్కుంటుంటే ఎ కోతో బయట నుండి మనల్ని చూసి గెంతుతుంది అప్పుడు తెలుస్తోంది. అది జూ లో గేంతుతుందో బాధతో అరుస్తుందో అని.


     అంతరిచిపోయిన జంతు జాతిని కాపాడడం ఎందుకు చచ్చి సుఖంగా ఉండవలసిన వాటిని బ్రతికించి హింషించడానికా ఐన ఇలా జూ లో జంతువులను పెట్టేస్తే జాతి అంతరించాకా అభివృద్ధి చెందుతుందా?.
         స్వేచ్చనివ్వండి వాటి బ్రతుకు వాటిని బ్రతకనియ్యండి వాటి స్థలం [అడవి]ను కాపాడండి.
                                                 చివరిలో వస్తుండగా చెట్టును చూసి నవ్వుకున్నాను ఎందుకంటే అది నడవలేదుగా లేకపోతే దానికి బోను బిగించేవారేమో.