Wednesday 20 July 2011

తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు

నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.

                                 తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు  అయితే మరి మన పెద్దలు ఏం చేసారు. మనకు ఏం చెప్పారు. అసలు పెద్ద వారు అంటే ఏవరు?
                .నేను ఇంకా చిన్న పిల్లవాడినే. ఎందుకంటారా నేను ఇంకా నేర్చుకునే ఉంటున్నాను. మరి నేర్చుకున్న ప్రతి వాడు చిన్న వాడు ఐతే ప్రతి మనిషి చిన్న వాడే ఎందుకంటే ఎవ్వరికి అన్ని విషయాలు తెలియవు. మరి పెద్ద వాళ్ళు ఏవరు?[వయస్సు కాదు ఇక్కడ ముఖ్యం ].  మరి అన్ని తెలుసు అనుకున్నవారా?      కాదు ఎందుకంటే తనకు ఏమి తెలియదన్న విషయం తనకు తెలుసు. మరి ఏవరు పెద్ద ?మనకంటే ఎక్కువ తెలిసిన వాడు మనకంటే పెద్ద.  
                          అయితే గాంధీ,నెహ్రు,వివేకానందుడు మొదలగు వారు మన కంటే క్షమించాలి నా కంటే పెద్దవారు. ఎందుకంటే నాకంటే వాళ్ళకు ఎక్కువగా తెలుసు. ఐతే వాళ్ళు ఏం చెప్పారు ఉన్న దానితో తృప్తి పదండి. అన్నారు తృప్తి చెందిన వారు ఐతే ఇ ఉద్యోగాలు, పోరాటాలు ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చుగా  దొరికితే తింటూ లేక పొతే దొరకలేదని తృప్తి పడుతూ మరి ఎందుకు ఇ చదువులు ప్రయాణాలు ఆపేద్దాం ఏమంటారు.

[ఇదంతా ఎందుకు రాసానంటే నేను బస్సులో వెళ్తూ ఉంటె వేరే సీట్లో కూర్చున్న నేను ఏదో కక్కుర్తితో లేచి వెళ్లి  విండో సీట్లో కూర్చున్న అందుకు ప్రక్కనున్న ఆయనా నన్ను ఎరా బాబు ఎందుకు అలా సీట్లు మారుతావు ఉన్న దానితో తృప్తి పడకుండా అని అన్నాడు. అందుకు నేను బదులుగా పై మాటలు అన్నాను. తప్పుగా అంటే మీరేక్షమించండి. ఎందుకంటే ఇంకా నేను మీ చిలిపి చిన్నోడినే కదా]

 "తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు" నిజమే మరి తృప్తి అంటే ఏమిటి?నాకు తెలిసినంత వరకు ఇది మనకు రాదు ఇంకా జరగదు అని అనిపిస్తేనే రాజీ పడతాం అదే  తృప్తి. అలాంటప్పుడే తృప్తి పడాలి.అప్పుడే మన మనసుకి ఆనందం ఆరోగ్యం , అవకాసం ఉంటె సాదించాలి.

                    "  శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది."

5 comments:

Srinu Web developer said...

wonderful pydi.............

Srinu Web developer said...

i love this............

తేజము said...

well said and i liked it ...
but i thing their is no meaning of "self satisfaction" in these days...

pydinaidu said...

thanks teja gaaru

Perugu Balu said...

అవునండి శ్రీ జగన్మోహన రెడ్డి గారి ని చుసినతరువాత మరి ఇంత ఆస ఉంటుందా అనిపిస్తుంది ఇన్ని కోట్లు మనిషికి అవసరమా ఇది చాలక ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఒక గొంతెమ్మ కోరిక వీరి దాయాదులు శ్రీ గాలి జనార్ధన రెడ్డి గారు రెండు రాష్ట్రాల సరిహద్దులనే చెరిపి వెయ్యగల సమర్ధులు వీరికి వీరే సాటి
ఇట్లు
పెరుగు బాలసుబ్రమణ్యం