Monday 26 January 2015

బ్రతకాలనే కోరిక


ఏ కష్టంలో రమ్మంటామో
ఏ బాధల్లో రమ్మంటామో
ఏ అపజయం లో రమ్మంటామో
ఏ అవమానంతో రమ్మంటామో
పిరికివాళ్ళం కదా మరి మేము
పిలిచినా రావద్దు నువ్వు
నా జాగ్రత్త లో నే ఉన్నా ఎదుట వాడి
తొందరపాటుకు నా దగ్గరకు వచ్చేస్తావ్
ఏ నిర్లక్ష్యం లో వస్తావో తెలీదు
ఏ ప్రమాదమై వస్తావో తెలీదు
ఇవన్నీ చావుకి ఆహ్వన లేఖలే
అవి నీకు అందకూడదని ఆశిస్తూ....
                        ----బ్రతకాలనే కోరిక 

Wednesday 21 January 2015

దొంగ కో లేఖ

ఒరేయ్ దొంగా
కాదులే
ఒరే మనిషీ
నా కష్టాలు తెలియవు నీకు
నా రెక్కల కష్టం గుర్తెరగువు నీవు
నా వాళ్ళనీ ఎరగవు నీవు
ఎక్కడో నిల్చున్న నన్ను
            కూర్చున్న నన్ను
            ప్రయాణిస్తున్న నన్ను
ఎలా ఎంచుకున్నావొ మరి నన్ను
అడిగితే ఇచ్చేవాడ్నెమో కదా కొంచెం
దొచేసావ్ పిల్లల చదువుల్ని
               ఒక కూతురి పెళ్లిని
               తాతయ్య ఆపరేషన్ని
               ఇంటి కనీస అవసరాల్ని
ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదు
ఏదో ఒకటి చేస్తాలే
ఎందుకంటే కష్టానికి కష్టాలకి అలవాటు పడిపోయాను మరి
తీసుకేళ్తే తీసుకెళ్ళావ్
నా చెమట వాసనతో సారాయో బ్రాందీ యో విస్కీ యో తాగొద్దు మరి
నా రెక్కల కష్టం తో పేకాట గట్రా అడోద్దు మరి
ఒళ్ళు హూనం చేసి సంపాదించిన పైసలతొ ఏ సాని కొంపలోకో వెళ్ళొద్దు మరి
ఈ పాటికే అవి నీ మంచి అవసరానికి చేరాయని ఆశిస్తున్నాను
ఒ నలుగురు ఆకలి తీర్చిందని సంబరపడుతున్నాను
నీకు కడుపు నిండిందని ఆనందంతో
ఈ రోజు సంతోషంగా పడుకుంటున్నా పస్తుతో