Tuesday 11 November 2014

బరితెగిస్తున్నబూతు

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు
చిన్నపిల్లల్నుంచి పెద్దలవరకు
కంప్యూటర్ చదివేవాడ్నించి కూలీ వరకు
అష్టాచెమ్మా ఆటనుంచి క్రికెట్‌ వరకు
ఎవరైనా సరే ఎక్కడైనా సరే
నోరు తెరిస్తే బూతులు

ఎదుటవారు చదివిన చదువును గుర్తించరు
అతని స్థాయిని పట్టించుకోరు
కనీసం వయస్సునూ గౌరవించరు
వారిముందే బూతులు
అమ్మాయిలు కనిపిస్తే చాలు కామపు కామెంట్సు

భార్యను నిర్బంధం చేసి ఒకరు
భర్త కళ్ళను కప్పి ఒకరు
సెల్లు ఫోనుల్లొ e మానసిక వ్యభిచారం
వాట్స్‌ అప్ లొ ఇంకా చెప్పక్కర్లేదు
ఫేస్ బుక్కుల్లొ ఇంకెన్నో

వయసు రాకముందే స్త్రీ శరీరసాంగత్యము
తెలుసుకొవాలనే ఆరాటం తో ఒకరు
వయసు మళ్ళినా స్త్రీ తనువును మరువలేని
తెలుసుకోలేని మరోకరు
ఈ సమాజమే మార్చిందని ఒకరు
ఈ సమాజమే మారిపోయిందని ఒకరు
కళ్ళు తెరిచే లోపే కళ్ళు మూసుకునే చర్యలు

మీడియా కూడా అంతే
హట్ హట్ సినిమా న్యూస్‌ లేని న్యూస్‌ చానల్  లేదు
ఐటం సాంగ్ లేని సినిమా కూడా లేదు
చివరకు మగాడు గెడ్డం గీసుకునే అడ్వటైజ్ మెంట్ లొ
కూడా చిత్రంగా ఇ అమ్మాయే
అమ్మాయిలు లేని ప్రయాణం బోర్
అమ్మాయిలు రాని కాలేజీలు దండగా
అమ్మాయిల కోసమే పండగలకు
అమ్మాయిల కోసమే జాతర్లకు
అమ్మాయిల కోసమే పెళ్ళిళ్ళకు
అమ్మాయిల కోసమే షికార్లకు

అవకాశం వస్తుందేమోనని ప్రేమ
అవసరం కోసమే అనుకోని పెళ్ళి
మనుషుల్లో తిరిగే ప్రేమల కంటే
 పార్కులో తిరిగే ప్రేమలే ఎక్కువ

స్త్రీ పై జరిగే అఘాయిత్యానికి కారణం
చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఆడిన
కామెంట్లు బూతులు ముదిరి
వాళ్ళ కోసమే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న
జాతర ఫేయిలై
సినిమా ఫేయిలై
షికారు ఫేయిలై
అవకాశం కోసం చూసిన ప్రేమా ఫేయిలైతే
అది క్రమేణా ముదిరి మగాడ్ని  మృగం లా మార్చి
ఎ ఆడపిల్ల ఒంటరిగా దొరికిన
ఎలాంటి అఘాయిత్యానికైనా తెగిస్తాడు

అదేంటో
సాటి మగాడు సాదించిన విజయం
సరి పొల్చుకొ అంటే
వాడు మనకంటే పెద్దవాడని
డబ్బున్న వాడని
చదువు కున్నవాడని
సాకులు వెతికే మనకి
అమ్మాయి ని చూసినప్పుడు మాత్రమే
మన మగతనం గుర్తొస్తుంది.
వయసూ చదువులను మరచి

చినుకు రాలడానికి ఒక సమయముంది
ఆకు కూడా కొన్ని సమయాలలోనే చిగురిస్తుంది
పూలు కూడా వాటి సమయంలొ మాత్రమే పూస్తాయి
వాటి సమయం వచ్చినప్పుడే పండ్లు పండుతాయ్
చివరకు కుక్క కూడా వేరొక కుక్కతో
సంభోగించడానికి ఒక కార్తి ఉంది
మనిషే ఎందుకో ఇలా
నాలుగోడల మధ్య జరిగేదాన్ని
నడిరోడ్డి పై మృగంలా.....

No comments: