Friday 17 October 2014

చేరిపేసింది ..కాదు కాదు


చిన్నప్పుటి జ్ఞాపకాలు చెరిపేసింది
వర్షం పడినప్పుడు గెడ్డలొ నీళ్ళకు ఆనకట్ట కట్టి
సుడులు తిరిగెట్టు నీళ్లను వదిలిన
మా ఇంజ"నీరు"ంగు"కళ"ను
మా రాజకీయ రోడ్డు చెరిపేసింది.
వర్షం పడినపుడు మా ఊరంచు మడిలో
మేం తయారుచేసిన కాగితపు పడవొ
తెలివైన వాడి ఆవిరిపడవొ
వదిలి ఇ చివరి అంచుల నుండి ఆ చివరికి
పరిగెత్తే జ్ఞాపకాలను అక్కడే గాలిపటం  ఎగరేసిన
మా "పైలట్  "కళ"ను మా ఉమ్మడి కుటుంబాల నుండి
విడిపోయిన ఇల్లు చేరిపేసాయి.
ఇప్పుడేమో
వేసవిశెలవుల్లొ  ఎ చెట్టు కిందైన
గోళీఅటొ,కర్రాబిల్లొ,క్రికెట్టొ ఆడే
 జ్ఞాపకాలను కూకటివ్రేళ్ళతో  సహ పికేసింది.
కాదు..!
అసహనంతో,బాధతొ, కోపంలొ ఏం చేయాలొ
తేలియక
మనల్ని ప్రేమతో  ఏమీచేయలేక
తనను తానే  పిచ్చిదానిలా కొట్టుకుంది,
ఏడ్చింది,పరుగెట్టింది,తిరిగింది,పడింది,తలను నేలకేసి
కొట్టింది,లేచింది.నడిచింది. కూచుంది.
పిచ్చిదానిలా  కాదు పిచ్చిదే!

పాపం రసాయనిక ఎరువులతో తనని నాశనం చేసి
ఎక్కడికక్కడ బోర్లుతో  తన గుండెను గుల్లగ చేసి
బహుళ అంతస్థుల బిల్డింగుల్తొ భారాన్ని నెత్తిని మోపి
కమ్యూనికేషన్ సాంకేతిక. అని పడని సిగ్నల్స్ విడిచి
వ్యాపారాలు ఉద్యోగాలు అంటూ తనని గాలికి వదిలి
తనని మనమే  పిచ్చదాన్ని  చేశాం.
చెరిపేసింది జ్ఞాపకాలు మొత్తం చెరిపేసింది
కాదు చెరిపేసుకున్నాం........అంతే!


ఎలాగైనా బ్రతికేగలం
అనే " ఆనందాన్ని నమ్మకాన్ని "
ఈ రోజుల్లో వీళ్ళందరి మధ్యలో
ఎలా  బ్రతకాలి అనే "భయం"
ఆ ఆనందాన్ని నమ్మకాన్ని  చేరిపేస్తున్నాయ్..