Tuesday 19 July 2011

అచ్చం మా పాపలాగే


                                                    కోడి కూసింది పల్లెమేల్కొంది. నేను ఇంకా పడుకోనే ఉన్నాను  ఎందుకంటే  లేవగానే మా పాప ముఖం చూడాలని తన పాలబుగ్గలను నిమరాలని. ఎక్కడో చిన్న నవ్వు  వినబడింది అవును అది నా పాపే. నాన్నా అంటూ నా దగ్గరకు వచ్చింది నేను లేచాను నా కాళ్ళను బంధించింది.ఎత్తుకున్నాను తన నుదిటిపై  అప్పుడే రవి ఉదయించినట్టు బొట్టుపెట్టింది వాళ్ళమ్మ. తన  నుదిటిపై ముద్దు పెట్టుకున్నాను.నాకు బుగ్గపై ముద్దు పెట్టింది.అలా బయటకు వచ్చాను అప్పుడే రవి ఉదయిస్తున్నాడు చాలా అందంగా కనిపిస్తున్నాడు మా పాప నవ్వులా.వాళ్ళమ్మ అందంలా.

                                  ఉదయం బోజనం  చేసి నేను బయటకు వెళ్తున్నాను పాప ఆడుకుంటుంది . రైతులు వారి వారి పనులుకు వెళ్తున్నారు సంక్రాంతి సమయం కావడంతో వీధి రోడ్లు రంగులతో ముస్తాబు గా  ఉన్నాయి.వాటిపై నడిస్తే కొడతారేమో అన్నంత అందంగా ఉన్నాయి ఆ ముగ్గులు.అందుకే అక్కడే నిలబడిపోయాను. నాన్న తన పనులు తను చూసుకుంటున్నాడు.నన్ను పట్నం వెళ్లి పంటకు కావలసిన  ఎరువులు, సామాన్లు తెమ్మన్నాడు.వెళ్ళాను అక్కడ పనులు ముగించుకొని వస్తున్నాను.సూర్యుడు  మండుతున్నాడు ఎండ తీవ్రత బాగా పెరిగింది సూర్యుడ్ని చూడలేకపోతున్నాం  ఏడుపులో మా పాపలా  కోపంలో వాళ్ళ అమ్మలా .

                             ఇంటికి చేరుకున్నాను నా బంగారు కొండలు నా గురించి ఎదురు  చూస్తున్నారు.రాగానే పాప నన్ను అల్లుకుంది వాళ్ళమ్మ నా చేతిలో సామాన్లు తీసుకోని వాటిని  భద్రపరిచింది. కాస్త అలసట తీర్చుకొని  భోజనం కానిచ్చి పాపతో ఆడుకుంటూ అలా నిద్రలోకి జారు కున్నాను పాప నా గుండెలపై ఆడుకుంటూ తను పడుకుంది. సాయంత్రం అయింది నేను లేచేసరికి. ఎప్పుడు లేచిందో  పాప మౌనంగా ఉంది వాళ్ళమ్మ బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతుంది నాకు అర్ధమైంది పాప అలిగిందని.అలా బయటకు వచ్చాను రవి అస్తమిస్తున్నాడు.చాలా జాలిగా కనిపించాడు.  మారంలో మా పాపలా బుజ్జగింపులో వాళ్ళమ్మలా.


                                            ఉదయం వెళ్ళిన రైతులు తమ పనులు ముగించుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకు వస్తున్నారు. నాన్న ఏదో పని మీద పిలిచాడు తనతో వెళ్లాను తిరిగి రాత్రైంది వచ్చేసరికి.అంతా  ప్రసాంతంగా  ఉంది ఇంటికి చేరుకున్నాం. పాప గురుంచి వాళ్ళమ్మను అడిగాను ఇప్పుడే పడుకుంది అనిచెప్పింది.రాత్రి  భోజనం కానిచ్చి ఆరుబయట  మంచంపై ఉన్న పాప దగ్గరకు వెళ్ళాను తను నిద్రపోతుంది.నేను పక్కనే పడుకొని ఆకాశం వైపు చూసాను చందమామ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నిద్రలోని మాపాపలా ప్రేమలో వాళ్ళ అమ్మలా.

1 comment:

Srinu Web developer said...

we catch her tomorrow.....don't worry............