Saturday 19 November 2011

చీ అమ్మంటేనే నాకు కోపం!!!! (చందమామ ఆవేదన)

చీ అమ్మంటేనే నాకు కోపం!!!!

జాబిల్లి రావే అని ప్రేమగా పిలుస్తుంది 
కానీ అన్ని నన్నే తెచ్చుకొమంటుంది.

గోరుముద్దలు ఆశగా చూపెడుతుంది.
ముద్దుగా అద్దంలో బందిస్తుంది.
చక్కగా నీళ్ళలో పడేస్తుంది.

చంకలో నా చిట్టిపాపను మాత్రం లాలిస్తుంది.
తనతో నన్ను ఆశల వలలో ఆడిస్తుంది .

జోల పాటతో చిట్టికి జో కొడుతోంది .
నేను నిద్రించే సమయానికి లేచి వెళ్ళిపోతుంది.

అమ్మా........
ఆకలితో ఆశగా వెళుతున్నాను.
రేపైనా నీ ఒడిలో జో కొడుతూ గోరుముద్దలు తినిపించవా............
                             

                                                   అందరికి   మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

4 comments:

Disp Name said...

చండురూడా,

కోప్పడకు,

ఆకాశ తల్లి నిను రోజు తన చేతులతో తీసుకెళుతోందీ
తల్లి బువ్వ నీకూ ఉందీ, నువ్వు లేక ఆ పిల్లవాడు బువ్వ తిన డే మరి !

pydinaidu said...

జిలేబి గారికి దన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni said...

మంచి కవిత. చాలా చక్కని ఎత్తుగడ. జోల పాటతో చిట్టికి జో కొడుతోంది .నేను నిద్రించే సమయానికి లేచి వెళ్ళిపోతుంది. అభినందనలు.

pydinaidu said...

thank u all