Saturday, 19 November 2011

చీ అమ్మంటేనే నాకు కోపం!!!! (చందమామ ఆవేదన)

చీ అమ్మంటేనే నాకు కోపం!!!!

జాబిల్లి రావే అని ప్రేమగా పిలుస్తుంది 
కానీ అన్ని నన్నే తెచ్చుకొమంటుంది.

గోరుముద్దలు ఆశగా చూపెడుతుంది.
ముద్దుగా అద్దంలో బందిస్తుంది.
చక్కగా నీళ్ళలో పడేస్తుంది.

చంకలో నా చిట్టిపాపను మాత్రం లాలిస్తుంది.
తనతో నన్ను ఆశల వలలో ఆడిస్తుంది .

జోల పాటతో చిట్టికి జో కొడుతోంది .
నేను నిద్రించే సమయానికి లేచి వెళ్ళిపోతుంది.

అమ్మా........
ఆకలితో ఆశగా వెళుతున్నాను.
రేపైనా నీ ఒడిలో జో కొడుతూ గోరుముద్దలు తినిపించవా............
                             

                                                   అందరికి   మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

Saturday, 12 November 2011

తెలుగు భాషా ఆ"భరణి"యం

my art
తనికెళ్ళ గురించి తెసుకోవాలా ఐతే ఇక్కడ నొక్కండి 

Tuesday, 8 November 2011

కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో

నెట్లో ఈ పాటను స్వామి సరస్వతి గారు అప్ లోడ్ చేసారు  
 ఈ పాట ఎవరు రాసారో ?
 ఎవరు పాడారో తెలిస్తే తెలుపగలరు?
అలాగే క్రింది కవిత ఎవరు రాసారో తెలుపగలరు 




అమ్మ మనసు

నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!


నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!


నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!


నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!


తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!


ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!


జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!


ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!


ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది. 
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!